NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్రిప్టో కరెన్సీ తులిప్ విలువ కూడ చేయవు !

1 min read

పల్లెవెలుగువెబ్ : ప్రైవేటు క్రిప్టో కరెన్సీలు ఆర్థిక స్థిరత్వానికి ముప్పు అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. అలాంటి కరెన్సీలకు ఎలాంటి విలువ ఉండదని, కనీసం తులిప్ పువ్వు విలువ కూడ చేయవని అన్నారు. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ నిర్ణయాలు ఆయన వెల్లడించారు. క్రిప్టో కరెన్సీలు ఆర్థిక స్థిరత్వం కోసం ఆర్బీఐ చర్యలను, సామర్థ్యాన్ని బలహీనపరుస్తాయని అన్నారు. సొంత పూచీకత్తు మీదే ఇన్వెస్టర్లు క్రిప్టో పై పెట్టుబడి పెట్టాలని హెచ్చరిస్తున్నానని అన్నారు. క్రిప్టో కరెన్సీ అంతర్లీనంగా ఎలాంటి ఆస్తులు కావని, కనీసం తులిప్ విలువ కూడ చేయవని అన్నారు. క్రిప్టో కరెన్సీని 17వ శతాబ్దంలో చోటుచేసుకున్న తులిప్ మానియాతో పోలుస్తూ శక్తికాంత్ దాస్ ఈ వ్యాఖ్యలు చేశారు.

    

About Author