పి4 కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లతో సిఎస్ వీడియో కాన్ఫరెన్స్
1 min read
రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలన్నదే పి4 కార్యక్రమ లక్ష్యం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పీ4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలు నమోదు, మార్గదర్శకులు గుర్తింపు పనులను ఆగష్టు,15వ తేదీ నాటికి పూర్తి చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర సెక్రటేరియట్ నుండి పీ4, అన్నా కాంటిన్లు,సంపూర్ణ పారిశుద్ధ్యం మహిళలపై నేరాల నియంత్రణ,మహిళా సాధికారత, ప్రకృతి వైపరీత్యాల సంసిద్ధత, అంగన్వాడీ కేంద్రాల ద్వారా రేషన్ పంపిణీ, పారిశ్రామికాభివృద్ధి,సూర్య ఘర్ యోజన,తదితర అంశాలపై వివిధ శాఖల రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో గురువారం సాయంత్రంవీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ విజయానంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరికంలేని సమాజాన్ని రూపొందించాలన్నదే పీ4 కార్యక్రమం లక్ష్యమన్నారు. పీ4 కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, నియోజకవర్గాల వారీగా బంగారు కుటుంబాల నమోదు, మార్గదర్శకులు గుర్తింపు పనులను వేగవంతం చేయడంతోపాటు జిల్లా స్థాయి సమీక్షలలో పీ4 కార్యక్రమానికి ప్రాధాన్యతను ఇచ్చి సమీక్షించాలన్నారు. అన్నా కాంటీన్లలో ప్రజల సంతృప్తి స్థాయిని పెంచేలా రుచికరమైన ఆహారాన్ని అందించడంతోపాటు, పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని, అల్పాహారం ను నిర్దేశించిన సమయంకంటే ముందుగానే అందించేలా చూడాలన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు జరగకుండా ముందస్తుగా ప్రణాళికలను రూపొందించుకుని అమలు చేయాలన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో రాష్ట్రంలో గ్రామ, పట్టణ ప్రాంతాలలో అపారిశుద్ధ్య పరిస్థితులు లేకుండా చూడాలని, పట్టణ ప్రాంతాలలో పారిశుద్ధ్యాన్ని కలెక్టర్లు పరిశీలించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ పీ4 కార్యక్రమంలో బంగారు కుటుంబాలు నమోదు , మార్గదర్శకులు గుర్తింపు పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేస్తామన్నారు. జిలాల్లోని గ్రామ, పట్టణ ప్రాంతాలలో పారిశుద్ధ్య పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, పట్టణ ప్రాంతాలలో పారిశుద్ధ్య పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తున్నామని, పారిశుధ్యం మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, డిఆర్ఓ వి.విశ్వేశ్వరరావు, జిల్లాపరిషత్ సీఈఓ శ్రీహరి,సిపిఒ వాసుదేవరావు,డిఆర్డిఏ పీడీ విజయరాజు,ట్రాన్స్కో ఎస్ఈ సాల్మన్ రాజు,డిపిఓ కె. అనురాధ,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.