నియోజకవర్గ అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులు మంజూరు చేయలి
1 min read
కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ కు విజ్ఞప్తి
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కార్పోరేట్ సామాజిక బాధ్యత నిధులు (సిఎస్ఆర్ ఫండ్స్) మంజూరు చేయాలని కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ కు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని కార్యాలయంలో కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ ను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో స్మశాన వాటికలను అభివృద్ధి చేసేందుకు, అలాగే ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన పరికరాలు సమకూర్చడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు విడుదల చేయాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విన్నవించారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో చేపట్టాల్సిన ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ తో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చర్చించారు. కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ నిధుల మంజూరుకు సానుకూలంగా స్పందించారని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల తరఫున నిధుల మంజూరుకు సంబంధించి అంచనాల నివేదికలను జిల్లా కలెక్టర్ ద్వారా రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు ఎంపీ స్పష్టం చేశారు. త్వరలో జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా సంబంధిత అధికారులను కలిసి విధుల మంజూరుకు కృషి చేస్తున్నట్లు ఎంపీ మహేష్ కుమార్ వెల్లడించారు.