PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

– సాంప్రదాయాలకు అనుగుణంగా పల్లెల్లో ఏరువాక పౌర్ణమి వేడుకలు….
పల్లెవెలుగు గోనెగండ్ల: ఏరువాక పౌర్ణమి పండుగ అతి ప్రాచీనమైంది. పూర్వం శ్రీ కృష్ణదేవరాయలు రైతన్నల కృషిని అభినందించి తగిన రీతిలో రైతులను ప్రోత్సహించినట్లు చరిత్ర చెబుతోంది. ఆధునిక టెక్నాలజీ ఎంత పెరిగినా… రైతు,ఎద్దు,నాగలి లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి.. దీనినే హలపౌర్ణమి అని కూడా అంటారు. వైశాఖ మాసం ముగిసి మొదలైన తరువాత వర్షాలు కురవడం మొదలవుతాయి. ఒక వారం అటూ ఇటూ అయినా కూడా జ్యేష్ట పౌర్ణమి నాటికి తొలకరి పడక మానదు. భూమి మెత్తబడక మానదు. అంటే ఎద్దు,నాగలితో సాగే వ్యవసాయపు పనులకు ఇది శుభారంభం అన్నమాట. అందుకనే ఈ రోజున అంటే దుక్కిని ప్రారంభించడం అంటూ పనిని ప్రారంభిస్తారు.. భారతీయ సంకృతికి, జీవన విధానానికి వ్యవసాయం మూలస్థంభం లాంటిది. దానికి తొలి పనిముట్టు నాగలి, ముఖ్య వనరు వర్షం. ఆ వర్షం కురిసే కాలం మొదలయ్యేప్పుడు రైతులు కృతజ్ఞతతో జరిపై పండుగ కృషి పూర్ణిమ దీనిని హల పూర్ణిమ లేదా ఏరువాక పున్నమి అనే పేర్లతో పిలవబడుతుంది. ఏరు అంటే నాగలి అని ,ఏరువాక అంటే దుక్కి ప్రారంభం అని అర్థాలున్నాయి.వ్యవసాయానికి కావాల్సిన వర్షాన్ని కురిపిస్తాడని భావించే ఇంద్రున్ని పూజించడం, నాగలిని పూజించి వ్యవసాయ పనులు మొదలు పెట్టడం జ్యేష్ట పూర్ణిమ పర్వదినం విశేషాలు.
*ఏరువాక పౌర్ణమి ఎందుకు…..
ఎండకాలం తర్వాత జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఏరువాక పర్వదినం జరుపుకుంటారు. వడగాల్పులు, ఉక్కపోతలు కష్టాలకు చిహ్నం. వాటిని తట్టుకుని కొత్త ఆశలతో వర్షానికి స్వాగతం చెప్పడమే దీని పరమార్థం. ఏరు అంటే నాగలి. వాక అంటే సాగటం, నది. ధైర్యానికి ప్రతీకైన నాగలితో దున్నుతాం. అలాగే జీవనక్షేత్రాన్ని దున్నాలంటే శ్రమ, పట్టుదల కావాలి. ఎద్దులు, పనిముట్లు నైపుణ్యానికి చిహ్నాలు. వీటిని వాడుకుని రైతు ఎదగాలి అని ఏరువాక చెబుతోంది..
*గోనెగండ్లలో ఘనంగా ఏరువాక పౌర్ణమి

మండల కేంద్రమైన గోనెగండ్లలో గురువారం ఏరువాక పౌర్ణమి వేడుకలు ఎద్దులకు రంగులు వేసి, గద్వాల గెరి చవిడిలో, గోకారమయ్యా చావిడి, ఒంటెయ్య స్వామి దర్గా దగ్గర వివిధ చోట్ల తోరణాలు కట్టి ఎద్దులను ఊరేగింపు నిర్వహిస్తూ…ఎద్దులతో పారువేట నిర్వహించి రైతులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎద్దులను అలంకరించేందుకు కొనుగోలు చేసిన రంగు రంగుల తాళ్లు, దండలు, గజ్జెలు, కొమ్ములకు రంగులు వేసి నిర్వహించారు.అలాగే ఉదయం నుండి గ్రామాల్లోని ఆలయాల్లో దేవదేవతలకు నైవేద్యం సమర్పించి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. గోనెగండ్ల తో పాటు ఆయా గ్రామాల్లో కూడా ఏరువాక పౌర్ణమి వేడుకలను రైతులు పాల్గొని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో రైతులు, నాయకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

About Author