NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘మల్బరీ’సాగు..రైతుకు భరోసా..

1 min read

ఎర్రనేలల, మధ్యరకం నేలల్లో అధిక సాగు

  • పట్టుపరిశ్రమల జిల్లా ఉన్నతాధికారి ఐ.విజయ్​ కుమార్​

పల్లెవెలుగు:పట్టుపరిశ్రమ రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను తీసుకొచ్చిందన్నారు కర్నూలు జిల్లా పట్టుపరిశ్రమల ఉన్నతాధికారి ఐ.విజయ్​కుమార్​. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం సంపాదించుకునే మార్గం  పట్టుపరిశ్రమలో ఉంటుందన్నారు.  ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పట్టుపరిశ్రమల రైతులకు అవగాహన కల్పించడంతోపాటు ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొందన్నారు. మల్బరీ సాగు చేసేందుకు ముందుకు వచ్చే రైతులకు… 5వేల మొక్కలు నాటితే.. నాటిన 45 రోజుల తరువాత రూ.18,750 సబ్సిడీ ఇస్తామన్నారు. అదేవిధంగా 2 ఎకరాల్లో సాగు చేసే జనరల్​ రైతులకు  రూ.3 లక్షలు, ఎస్సీ ఎస్టీలకు రూ.3.60 లక్షలు సబ్సిడీ ఇస్తోందన్నారు.

దరఖాస్తు… ఇలా..:

జిల్లాలోని అన్ని  రైతు భరోసా కేంద్రాలు( ఆర్​బీకే)లలో పట్టుపరిశ్రమ శాఖ సిబ్బంది ఉన్నారని, అక్కడ రైతులు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే పథకాలకు అర్హలన్నారు ఆశాఖ ఉన్నతాధికారి విజయ్​ కుమార్​. సాగు చేసే రైతులలు పట్టు ఉత్పత్తులను ప్రభుత్వం నిర్మించిన భవనంలో నిల్వ చేసుకోవచ్చన్నారు.

About Author