ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో అవినీతిని అరికట్టండి
1 min read(జనసేన మండల నాయకులు, రామాంజనేయులు)
పల్లెవెలుగు వెబ్ కౌతాళం: మండల పరిధిలో అయినటువంటి ఎంతో ప్రసిద్ధి గాంచిన పుణ్య క్షేత్రమైన ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానంలో నిత్యం వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారికి భక్తులు వివిధ రూపాల్లో ముడుపులను చెల్లించుకుంటారు, స్వామివారి యెక్క మొక్కు తీర్చుకుంటారు, వివిధ రూపాల్లో సామాగ్రిని సమర్పించుకుంటారు. దేవాలయాలనికి కోట్లల్లో ఆదాయాన్ని దేవాలయానికి వస్తున్న అభివృద్ధి నోచుకోని స్థితిలో ఉంది ,దీన్ని ఆసరాగా చేసుకుని భక్తుల నుండి వసూళ్లు పాల్పడుతున్నారని తెలియజేశారు. అధికారులు అలాగే టెండర్ విషయంలో తలనీలలు,టెంకాయలు, బియ్యం, బ్యాళ్లు, ఈ టెండర్లను ఒకే వ్యక్తికి పేరు మారుస్తూ బినామీ పేర్లు మీదగా టెండర్లు కట్టబెడుతున్నారు దీనివలన ఆలయానికి ఆదాయం ఆలయం తగ్గుతుంది. అధికారులు ఇచ్చిన వాళ్లకే మరల ఎందుకు ఈ టెండర్లు కట్టబెడుతున్నారు.. దిన్ని అలుసుగా తీసుకుని, టెంకాయ దగ్గర నుంచి తలనీలాలు సమర్పించే వరకు అవినీతి అడుగున అడుగున కొట్టే వాళ్ళ దగ్గర నుంచి గుండు కొట్టే వరకు భక్తుల నుంచి కాసులను దండుకుంటున్నారు. దీనిపై జిల్లా యంత్రాంగం దేవదాయ శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని. ఇచ్చిన టెండర్లను రద్దు చేసి కొత్త ,రి టెండర్ వేయాలని కోరారు. లేనియెడల హిందూ సంఘాలను కలుపుకుని భారీ ఎత్తున ధర్నాకు దిగుతామని హెచ్చరించారు.