ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఆంధ్ర ప్రదేశ్ లో రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 14 వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. రాష్ట్రంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 78,784 నమూనాలు పరీక్షించగా.. 2,107 మంది కరోన బారిన పడ్డారు. కరోన కారణంగా 20 మంది మరణించారు. ప్రస్తుతం 21,279 మంది కరోన తో చికిత్స పొందుతున్నారు.