సోమవారం ఉదయం వరకు కర్ఫ్యూ !
1 min read
పల్లెవెలుగువెబ్ : శ్రీలంక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. నిరసనలతో అట్టుడుకుతోంది. సోమవారం ఉదయం వరకు కర్ఫ్యూ విధించారు. శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. దేశాధ్యక్షుడు రాజపక్స, ఆయన బంధువులకు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనలను కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని అమలు చేస్తూ, పోలీసులకు మరిన్ని అధికారాలను కల్పించింది. పెట్రోలు, డీజిల్, ఆహారం, మందుల కొరత కారణంగా ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశాధ్యక్షుడు రాజపక్స నివాసంలోకి చొరబడేందుకు కూడా కొందరు నిరసనకారులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో 36 గంటలపాటు దేశవ్యాప్తంగా కర్ఫ్యూను విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.