NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మ‌హేష్ బాబు బంధువు కంపెనీకి క‌రెంట్ క‌ట్…!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ కుటుంబ స‌భ్యుల ఆధ్వర్యంలో న‌డుస్తున్న అమ‌ర్ రాజా బ్యాట‌రీస్ సంస్థకు క‌రెంట్ క‌ట్ చేశారు. దీంతో శ‌నివారం నుంచి పూర్తిగా విద్యుత్తు నిలిచిపోయింది. అమ‌ర్ రాజ్ బ్యాట‌రీస్ సంస్థ కు ఆంద్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండ‌లి క్లోజ‌ర్ నోటిస్ జారీ చేసింది. విద్యుత్తు స‌ర‌ఫ‌రా నిలిపివేయాల‌ని ఎపీసీపీడిసిఎల్ కు ఆదేశాలిచ్చింది. సంస్థకు చెందిన చిత్తూరు జిల్లా నూనెగుండ్ల ప‌ల్లి, క‌రంబాడి ప్లాంటుల్లో ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు, ఆపరేష‌న్ నిర్వహ‌ణ స‌మ్మతిలో విధించిన నిబంధ‌న‌లు ఉల్లంఘించిన నేప‌థ్యంలో అమ‌ర్ రాజా బ్యాట‌రీస్ సంస్థ మూసివేత‌కు ఆదేశాలిచ్చిన‌ట్టు తెలిపింది. గ‌ల్లా జ‌య‌దేవ్ టాలీవుడ్ హీరో మ‌హేష్ బాబుకు స్వయాన బావ‌.

About Author