సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్ట్
1 min read– ముగ్గురు నైజీరియన్లు… ఇద్దరు మణిపూర్ మహిళలు
– ఢిల్లీ వెళ్లి.. పక్కా ప్లాన్‌తో పట్టుకున్న సీసీఎస్ సీఐ శేషయ్య
– వెల్లడించిన ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణం గాంధీ నగర్‌కు చెందిన చిదానంద స్వామి ( స్కూల్ టీచర్)ను ఫేక్ ఫేస్బుక్ ఐడీ ద్వారా ముగ్గురు నైజిరియన్లు పరిచయం చేసుకున్నారు. సదరు నైజీరియన్లు యూకేలో Shell Oil Company కంపెనీ పేరుతో Oil business చేస్తున్నామని దానికి అవసరమైన Raw material Oil stock(ముడి సరుకు) ముంబాయికి చెందిన భవాని ట్రేడర్స్ ద్వారా Oil కోనుగోలు చేస్తారని, అయితే తమది ఫారిన్ కంపెనీ అయినందున TAX ఎక్కువగా పడుతుందని స్కూల్ టీచర్ చిదానంద స్వామితో చెప్పారు. ఈ క్రమంలో మీ (స్కూల్ టీచర్) పేరుతో తెప్పించుకుంటే ట్యాక్స్ తక్కువ పడుతుంది, ఇందుకు లీటరుకు రూ.80 ఇస్తామని నమ్మించారు. వారి మాటలను నమ్మిన చిదానంద స్వామి మూడు విడతలుగా రెండు బ్యాంకు అకౌంట్లలో మొత్తం రూ.11 లక్షల 24వేలు డిపాజిట్ చేశాడు. ఆ తరువాత నైజిరియన్లు అందుబాటులోకి రాకపోవడంతో.. మోసపోయానని భావించిన చిదానంద స్వామి 2020లో ఎమ్మిగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. Cr.No.255/2020 U/Sec.420 IPC and Sec.66(D) of IT Act క్రింద జూలై 30 న 2020 కేసు నమోదు చేశారు. ఈ కేసులోని ముద్దాయిల కొరకు కర్నూల్ సిసియస్ పోలీసులైన CI శేషయ్య , హెడ్ కానిస్టేబుల్ – 2619 M.V. శ్రీనివాసులు, కానిస్టేబుల్ – 1191 బి. శ్రీనివాసులు, AR PC – 1439 G. జనార్ధన్, WHG 1020 వి. భారతిప్రత్యేక పోలీసు బృందంగా ఏర్పడి నిందితుల కొరకు మహరాష్ట్ర(బొంబాయి), ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలలో గాలింపు చర్యలు చేపట్టి ముగ్గురు విదేశీయు(నైజీరియన్ల)లను, మణిపూర్ రాష్ట్రానికి చెందిన మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుండి 16-బ్యాంక్ అక్కౌంట్ బుక్స్, 33-ATMDebit/Credit కార్డ్స్, 2- చెక్ బుక్స్, 9-సెల్ ఫోన్స్, 3-లాప్ టాప్ లు, 3-ఫారిన్ పాస్ పోర్ట్స్, 2 – ఆధార్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాలను జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సమావేశంలో సిసియస్ సిఐ శేషయ్య, ఎమ్మిగనూరు టౌన్ సిఐ శ్రీనివాసనాయక్ ఉన్నారు.