సైక్లింగ్ ఆహ్లాదకరమైనది ఆరోగ్యకరమైనది..
1 min read–డి.యo.అండ్.హెచ్.ఓ డాక్టర్ మోహన్ రావు
– సైక్లింగ్ మానసిక శ్రేయస్సులో సహాయపడుతుంది..
– డిసిహెచ్ఎస్ డా. ఎవిఆర్ మోహన్.
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : సైక్లింగ్ తో అద్బుత ప్రయోజనాలు ఉన్నాయని డిసిహెచ్ఎస్ డా. ఎవిఆర్ మోహన్ అన్నారు. జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ వారి సూచనలతో మంగళవారం స్ధానిక ఇండోర్ స్టేడియం వద్ద నిర్వహించిన సైకిల్ ఫర్ హెల్త్ కార్యక్రమాన్ని డిఎంహెచ్ఓ డా. నాగేశ్వరరావుతో కలిసి డిసిహెచ్ డా. ఎవిఆర్ మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సైక్లింగ్ చేయడం వలన కండరాలు బడపడటంతోపాటు శరీర బరువు తగ్గేందుకు సహకరిస్తుందన్నారు. గుండె ఆరోగ్యానికి మంచిదని అదే విధంగా అధిక రక్తపోటు తగ్గిస్తుందన్నారు. అంతేకాకుండా వత్తిడి, మానసిక వేదనలను నియంతించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుందన్నారు. అన్ని వయస్సుల వారికి అనుకూల ప్రభావం చూపే వ్యాయామం సైక్లింగ్ అని ఆయన పేర్కొన్నారు. క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం వలన మధుమేహం, ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు, వివిధ జీవనశైలి రుగ్మతలు అనేక ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ ఓ డా. నాగేశ్వరరావు, అధనపు డిఎంహెచ్ఓ రత్నకుమారి, సెట్ వెల్ సిఇఓ ఎండి మెహరాజ్, క్రీడాశాఖాధికారి శ్రీనివాసరావు పలు విద్యాసంస్ధల విద్యార్ధినీ, విద్యార్ధులు, వైద్య సిబ్బంది, ఇండియన్ రెడ్ క్రాస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.