ఆంధ్రాకు తుఫాను హెచ్చరిక
1 min readపల్లెవెలుగువెబ్ : దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో భారత వాతావరణ శాఖ శనివారం ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు పాటించాలని సూచించింది. అల్పపీడనం ఆదివారం సాయంత్రానికి బలపడి తుపానుగా మారుతుందని అధికారులు తెలిపారు. వచ్చే వారం నాటికి ఇది వాయవ్యంగా ముందుకు కదులుతూ ఉత్తర ఆంధ్రప్రదేశ్-ఒడిశా తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉందని వివరించారు. ఒకవేళ ఇది తుపానుగా రూపాంతరం చెందితే దానికి ‘ఆశాని’ గా నామకరణం చేస్తారు.