రజనీకాంత్ కు దాదాసాహెబ్ పాల్కే అవార్డు
1 min read
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ పాల్కే అవార్డు ప్రకటించింది. రజనీకాంత్ కు 51వ దాదాసాహెబ్ పాల్కే అవార్డు ప్రకటిస్తున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ తెలిపారు. అయితే.. మరోవైపు తమిళనాడు ఎన్నికల నేపథ్యంలోనే ఇప్పటికిప్పుడు అవార్డు ప్రకటించినట్టు పలువురు విమర్శిస్తున్నారు. తమిళనాడు ఎన్నికల్లో రజనీకాంత్ అభిమానుల మన్ననలు పొందేందుకే ఈ ప్రకటన చేశారని డీఎంకే అభిమానులు ఆరోపిస్తున్నారు. తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే కలసి పోటీ చేస్తున్నాయి.