దళిత సీఎం సాధన కోసం దళిత గర్జన : వి కృష్ణస్వరూప్
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: దళిత సీఎం సాధన కోసం మార్చి 17 వ తేదీన జరిగే దళిత గర్జన సదస్సును విజయ వంతం చేయాలని సుప్రీం కోర్టు న్యాయవాది వడ్లమూడి కృష్ణ స్వరూప్ పిలుపునిచ్చారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లో రెండు ప్రధాన కులాలు, రెండు పార్టీలు రాజ్య అధికారాన్ని చేతుల్లో పెట్టుకొని మెజారిటీ దళిత బహుజన ప్రజలను సామాజికంగా, ఆర్దికంగా రాజికీయంగా తీవ్ర అణిచివేతకు పాల్పడుతున్నారు ఆరోపించారు. దళితులను కేవలం ఓటు బ్యాంక్ గానే చూస్తున్నారని విమర్శించారు. దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమురి కృష్ణ స్వరూప్ అన్నారు. రాష్ట్రంలో దళిత ప్రజలను భవిష్యత్ ను కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వా లు రోడ్డు పాలు చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజ్యాంగ రక్షణ కోసం, దళిత ప్రజల భవిష్యత్ కోసం మేము పోరాటం చేస్తాము అన్నారు. దేశం లో ఏ రాష్ట్రానికి లేని దౌర్భాగ్య స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉందని, రాజదాని లేని రాష్ట్రం ఏపి అని చెప్పారు. దళితులకు చెందాల్సిన వేల కోట్ల రూపాయల ను వారికి దక్క కుండ చేశారని పేర్కొన్నారు. రాజ్యాధకారం నిమ్న జాతుల చేతుల్లో లేనందు వల్ల ఈ జాతులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. విద్యా, ఉపాధి, ఆరోగ్యం, రక్షణ అంశాలను ఈ ప్రభుత్వాలు , పార్టీలు తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి పదవి దళితుల చేతుల్లో ఉండాలనే ఉద్దేశ్యంతో దళిత బహుజన పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని సూచించారు. తద్వారా చట్టసభలలో అంబేద్కర్ వాదులను పంపించాలని పిలుపునిచ్చారు. ఇందులొ బాగంగా మార్చి 17 వ తేదీన వేలాది మంది తో జరిగే దళిత గర్జన మార్చ్ ను విజయవంతం చేయాలని, ఆ బాధ్యత దళిత బహుజన ఓటర్లు పైనే ఉందని అన్నారు. దళితుల సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసి దళిత జాతులకు తీరని ద్రోహం చేశారు అని చెప్పారు. ఈ రాష్ట్రం లో దళితులను ఇంకా ఎన్నాళ్ళు దోచు కుంటారని ప్రశ్నించారు. దళిత హక్కులు రాజ్యాధికారం తోనే సాధ్యం అని అన్నారు. అది ఇంకా ఎన్నో రోజులు లేదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత బహుజన పార్టీ నాయకులు మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.