PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దళితుల భూములకు రక్షణ కల్పించాలి..

1 min read

– కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసిన ప్రజా సంఘాలు:
పల్లెవెలుగు, వెబ్ నంద్యాల: బుధవారం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బహుజన్ సమాజ్వాది పార్టీ, ఎమ్మార్పీఎస్ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు డి సద్దాం హుస్సేన్, బీఎస్పీ పార్టీ నందికొట్కూరు ఇంచార్జ్ ఎల్ స్వాములు, ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రేమ రాజ్, రైతు సంఘం నాయకులు సుధాకర్ మాట్లాడుతూ నందికొట్కూరు మండలం మద్దిగట్ల పొలిమేరలో సర్వేనెంబర్ 77/1, 113, 111, 70, 71 సర్వే నెంబర్లలో దళితులు బీసీలు మైనార్టీ కులాలకు చెందిన 200 కుటుంబాలు పూర్వకాలం నుండి వీడు భూములను సాగు చేసుకుని పంటలు వేసుకుంటున్నారు కొంతమంది గనేట్లు చేసుకొని జీవనం సాగిస్తున్నారు, పట్టాల కోసం అనేకసార్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించిన కొంతమందికి పట్టాలు ఇచ్చారు . కొంతమందికి ఇవ్వడం లేదని వారు తెలియజేశారు పూర్వం నుండి సాగు చేసుకుంటున్నా దళితుల పంట పొలాల్లో నందికొట్కూరు మున్సిపాలిటీ అధికారులు అధికారులు దౌర్జన్యంగా డంపు యార్డు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య కు వినతిపత్రం అందజేశారు. అందుకు వెంటనే జేసీ స్పందించి ఆత్మకూరు ఆర్డిఓ పిలిపించి వీటి పైన విచారణ చేయాలని పాత డంపింగ్ యార్డ్ ను ఎందుకు మారుస్తున్నారో వివరాలు తెలియజేయాలని ఆర్డిఓ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రైతులు నాగరాజు, జాన్ ,సొల్మోన్, బాబు ,విక్రమ్, వెంకటరమణ,,రాముడు, ఎల్లమ్మ, శ్రీనివాసులు, సునీల్ ,మల్లికార్జున, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

About Author