PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ ప్రభుత్వం లో దళితులకు రక్షణ కరువైంది

1 min read

– వైసిపి ప్రభుత్వానికి సామాజిక న్యాయ బస్సుయాత్ర చేసే నైతికత లేదు

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  టీడీపీ  రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి,  నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గౌరు వెంకటరెడ్డి ఆదేశాల మేరకు దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ నందికొట్కూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం టిడిపి నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దళితులను జీవించే హక్కు కూడా లేకుండా పోయిందని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలోను  నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ ప్రతి వేదికపై ముఖ్యమంత్రి జగన్ వారిపై ఎనలేని ప్రేమ ఉలకపోస్తున్న వైకాపా పాలనలో దళితులపై దాస్టికాలు రోజురోజుకు పేచ్చరిల్లిపోతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్లకు చెందిన దళితుడైన శ్యామ్ కుమార్ పై అగ్రకులానికి చెందిన హరీష్ రెడ్డి అతని స్నేహితులు మరో ఆరుగురు కలిసి అమానుషంగా ప్రవర్తించారు శ్యామ్ కుమార్ ని కారులో తీసుకువెళ్లి నాలుగు గంటలపాటు ఎన్టీఆర్,  గుంటూరు జిల్లాలో తిప్పుతూ తీవ్రంగా కొడుతూ చిత్రహింసలు పెట్టి నరకం చూపించారు. దాహంగా ఉంది మంచినీళ్లు కావాలని అతను ప్రాధేయపడితే రహదారి మధ్యలో కారు ఆపి మూత్రం పోసి అవహేళన చేస్తూ అమానుషంగా ప్రవర్తించారు. బాధితులని కులం పేరుతో దూషిస్తూ ఇవి మీ బతుకులు అంటూ అవమానకరంగా దూషించారు. ఏం చేసినా వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అని చూసుకుంటారు అన్న ధైర్యంతోనే వీళ్ళు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. ఇంత జరిగితే పోలీసులు వాళ్ళ మీద పెట్టిన కేసులు చూస్తే అన్ని బైబుల్ సెక్షన్ లే పెట్టారు. హత్యాయత్నం కేసు మాత్రం పెట్టలేదు. ఈ రాష్ట్రంలో దళిత బడుగు బలహీన వర్గాల మీద దాడులు నిత్యకృత్యం అయిపోయాయి.ఈ రాష్ట్రంలో దళితులకు జీవించే హక్కు లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు . రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు, హత్యలు, హత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణను కరువయ్యిందన్నారు. అధికారపార్టీ రౌడీమూకలు దళితులపై రెచ్చిపోయి దాడులకు పాల్పడుతుంటే నోరుమెదపని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. దళితులపై దాడులను అరికట్టలేని వైసిపి ప్రభుత్వానికి సామాజిక న్యాయ బస్సుయాత్ర చేసే నైతికత లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జయసూర్య, టీడీపీ నాయకులు జయరాజు, న్యాయవాది నాగముని,టీడీపీ పట్టణ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి,టీడీపీ మైనార్టీ నాయకులు ముర్తుజావలి, జమీల్, రసూల్, టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు నిమ్మకాయల మోహన్, రాజు, రాజన్న, కళాకార్,  శాంతరాజు, అయ్యరాజు, ఏసేపు, శేఖర్, కుమార్, నాగరాజు, అప్సర్, రగడ, హుస్సేన్, వెంకటేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author