PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కొండ సమస్యను పరిష్కరించాలని దళితుల ధర్న..

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల : మండల కేంద్రంలోని గోనెగండ్ల ఎస్సీ కాలనీలో గత 11 రోజుల క్రితం పగిలి దళితులను భయభ్రాంతులకు గురి చేస్తున్న నర్సప్ప కొండను సంపూర్ణంగా తొలగించాలని కోరుతూ కెవిపిఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలోని నరసప్ప కొండ నుండి ఎర్రని ఎండని సహితం లెక్కచేయకుండా ర్యాలీగా బయలుదేరి తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి ఆనంద్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు బి కరుణాకర్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండ పగిలిపోయి 11 రోజులైనా అధికారుల మాటలు తప్ప చేతలు ప్రారంభం కాలేదని వారు మండిపడ్డారు. 6000 నుండి 8000 టన్నుల బరువు ఉండే కొండ ఒక్కసారి చిద్రం అయితే చుట్టుపక్కల అర కిలోమీటర్ విస్తీర్ణం వరకు తీవ్ర ప్రమాదం ఏర్పడుతుందని తెలిసినా.. కొండను తొలగించేటువంటి పనులు ఇప్పటికీ ప్రారంభించలేదన్నారు. పది రోజుల క్రితం పగిలిన కొండ ఇంచు నుండి ఆరు ఇంచుల వరకూ పగులు విస్తీర్ణం పెరిగిందన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత మాటలు చెప్పడం కాకుండా దళితుల ప్రాణాలకు రక్షణ కల్పించాలన్నారు. వెంటనే పనులు ప్రారంభించక పోతే, సోమవారం దళితులతో కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక దళితులు మునెప్ప, రాజు, ఎస్తేరమ్మ, ఎరుకలి ఉలిగమ్మ, నాగరాజు, నాగప్ప, నడిపి బతకన్న, గంజి రోగన్న, నరసింహుడు, రంగమ్మ, హనుమక్క తదితరులు పాల్గొన్నారు.

About Author