PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ద‌ళితులే తెలుగుదేశాన్ని గెలిపిస్తారు.. టిడిపి ఇంచార్జి టి.జి భ‌ర‌త్

1 min read

ద‌ళిత చైత‌న్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన టి.జి భ‌ర‌త్, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జ‌న‌సేన అర్షద్‌

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రాష్ట్రంలోని ద‌ళితులంద‌రూ తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నార‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ అన్నారు. బుధ‌వారం న‌గ‌రంలోని పాత‌బ‌స్టాండులో అంబేద్కర్ విగ్రహానికి పూల‌మాలలు వేసి ద‌ళిత జేఏసీ ఛైర్మన్ బొల్లెద్దుల రామ‌కృష్ణ ఆధ్వర్యంలో చేప‌ట్టిన‌ ద‌ళిత చైత‌న్యం కార్యక్రమాన్ని ఆయ‌న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యద‌ర్శి సోమిశెట్టి వెంక‌టేశ్వర్లు, జ‌న‌సేన ఇంచార్జి అర్షద్, పాల్గొన్నారు. అనంత‌రం వీధుల్లో తిరుగుతూ ప్రజ‌ల‌ను క‌లిసి ద‌ళిత చైత‌న్యం కార్యక్రమం గురించి వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమ‌లులో లేద‌న్నారు. నిజ‌మైన అంబేద్కర్ రాజ్యాంగం అమ‌ల‌వ్వాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల‌న్నారు. క‌ర్నూల్లో తాను గెలిచిన వెంట‌నే నిజ‌మైన రాజ్యాంగం న‌డిచేలా చేస్తాన‌న్నారు. ఈ ప్రభుత్వం ద‌ళితుల ఓట్ల‌తో ఏర్పడిన‌ప్పటికీ.. ఈ ఐదేళ్లలో ద‌ళితుల‌కు ఎంతో న‌ష్టం జ‌రిగింద‌ని తెలిపారు. అందుకే తెలుగుదేశం పార్టీకి దళితులంద‌రూ మ‌ద్దతు తెలుపుతున్నార‌ని పేర్కొన్నారు. క‌ర్నూల్లో త‌మ పార్టీ నేత‌లు జేఏసీగా ఏర్పడి ద‌ళిత చైత‌న్యం కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజ‌ల్లో చైత‌న్యం తీసుకొస్తున్నార‌ని చెప్పారు. అనంత‌రం సోమిశెట్టి వెంక‌టేశ్వర్లు మాట్లాడుతూ సీఎం జ‌గ‌న్ ద‌ళితుల ద్రోహి అన్నారు. ద‌ళితుల‌కు మేలు చేసింది ఒక్క చంద్రబాబు నాయుడే అన్నారు. క‌ర్నూల్లో కుల‌, మ‌తాల‌కు అతీతంగా సేవ చేసే వ్యక్తి టి.జి భ‌ర్ అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న్ను త‌ప్పకుండా గెలిపించాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో ద‌ళిత జేఏసీ స‌భ్యులు దేవా, గున్నామార్క్‌, సుంక‌న్న‌, పామ‌న్న‌, తిమ్మోజీ, పోతురాజు ర‌వి, నాగ‌న్న‌, పాల్‌రాజ్‌, శ్రీనివాసులు, ఆర్య శంక‌ర్‌, మాధ‌వ‌స్వామి, చిన్నమ్మి, శార‌ద‌మ్మ‌, ఏస‌న్న‌, రాజ్ కుమార్‌, మోహ‌న్‌, ఈశ్వర్‌, పెంచ‌ల‌య్య‌, ప్రసాద రావ్‌, మ‌ధుబాబు, ఆనంద రావు, ల‌క్ష్మినారాయ‌ణ‌, మ‌ల్లికార్జున బాబు, సురేష్‌, మ‌ణిబాబు, రామాంజ‌నేయులు, బాను, రామ‌య్య‌, అఖిల్‌, కిర‌ణ్‌, సురేంద్ర‌, మ‌ణి ప్ర‌కాష్‌, జూటూరు ర‌వి, త‌దిత‌ర ముఖ్య నాయ‌కులు, జ‌న‌సేన నాయ‌కులు, టిడిపి అనుబంధ సంఘాల నాయ‌కులు పాల్గొన్నారు.

About Author