అకాల వర్షానికి మిర్చి మొక్కజొన్నకు నష్టం
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: గురువారం రాత్రి అకస్మాత్తుగా కురిసిన వడగళ్ల వానకు కోతకు వచ్చి కల్లంలో ఆర వేసుకున్న మిరప తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అలాగే కోత దశకు వచ్చిన మొక్కజొన్న గాలి వానకు నెల కొరగడంతో కంకులు బూజు పట్టి దిగుబడి తగ్గి ధర తగ్గే అవకాశం ఉందని వాపోయారు రెండు ఎకరాల్లో మిరప పంట వేసినట్టు పంట ఆర వేసుకున్న సమయంలో అకాల వర్షం కురిసి నష్టాలపాలు చేసిందని చిందుకూరు గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం మిరపకు ధర బాగుండడంతో లాభాలు వస్తాయి అని ఆశిస్తే వరుణ దేవుడు తమ ఆశలను అడియాసలు చేశాడని వాపోయారు వాతావరణ శాఖ సూచన ప్రకారం రెండు రోజులు వర్షాలు ఉన్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం అంచనా వేసి నష్టపరిహారం అందజేయాలని రైతులు కోరుతున్నారు నష్టం అంచనా పై వ్యవసాయ శాఖ అధికారులకు వివరాలు అడగగా పంట నష్టపరిహారం అంచనా వేస్తున్నామని జిల్లా అధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు.