మండలంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన శాస్త్రవేత్త
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మిచాంగ్ తుపాను వల్ల మండలంలో దెబ్బతిన్న పంటలను అగ్రికల్చర్ రీఛార్జ్ స్పెషన్ ఊటుకూరు ప్రధాన శాస్త్రవేత్తలు ఎం జాన్సన్, కే సునీల్ కుమార్ గురువారం పరిశీలించారు, ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ దెబ్బతిన్న పంటల పై తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి తెలియజేశారు, వరి చేను పడిపోయి నీట మునిగితే ప్రాపికొనజోల్ ఒక మిల్లి లీటర్ లీటర్ నీటితో కలిపి పిచికారి చేయాలని తెలిపారు, అదేవిధంగా దుబ్బ చేసే దశ నుండి పొట్ట దశలో ఉన్న వరికి తెగుళ్లు రాకుండా టేబుకొన జొల్ ట్రిపోక్లో స్ట్రోబిన్25 డబ్ల్యూ ఏ ఎకరానికి 80- 120 గ్రాములు అలాగే కాండం తొలుచు పురుగు వంటివి రాకుండా క్లిరాంట్రిన్ప్రోల్ 18.5/5సీ, 60 మిల్లీమీటర్లు ఎగరాకు కలిపి పిచికారి చేయాలని తెలిపారు, అదేవిధంగా మినుము పంటకు హెక్షణజొల్ 400 మిల్లీలీటర్లు ఎకరాకు అలాగే నో వాల్యూ రాన్ 300 మిల్లీలీటర్లు ఎకరాకు రెండింటిని కలిపి పిచికారి చేయాలని తెలిపారు, అలాగే జొన్నలో గింజ బూజు తెగులు రాకుండా కార్తయిడిజం ఒక మిల్లీమీటర్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలిపారు, పై మందులు పిచికారి చేసేటప్పుడు అందులో 13-0-45 10 గ్రాములు లీటర్ నీటితో కలిపి పిచికారి చేయడం వలన మొక్కలు నిల తొక్కుతాయని తెలిపారు, ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కే శ్రీదేవి అగ్రికల్చర్ ఇందిరా రైతులు పాల్గొన్నారు.