కన్నుల పండుగ గా దామోదర హారతి
1 min readపల్లెవెలుగు, వెబ్ చెన్నూరు: చెన్నూరు మండలం కొండపేట అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ భజన మందిరంలో శ్రీకృష్ణ పరమాత్మకు దామోదర హారతిని శనివారం సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ఏడున్నర గంటల వరకు కొనసాగింది. ఇస్కాన్ భక్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు నెల రోజులు కొనసాగే దామోదర హారతి మరో నాలుగు రోజుల్లో ముగియన్నది. దామోదర హారతి విశిష్టత చిన్నతనంలో శ్రీకృష్ణ భగవానుడు యశోద మధ్య వెన్న కోసం శ్రీకృష్ణ భగవానుడు తల్లియశోద దేవినిప్రాధేయపడడం తన తోటి స్నేహితులతో వెన్నను తీసుకోవడం వంటి సంభాషణలు వృత్తాంతమే దామోదర హారతి విశిష్టత. ప్రతిరోజు హరే రామ హరే కృష్ణ నామంతో భక్తులు సంకీర్తన నిర్వహిస్తూ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దామోదర హారతి అనంతరం భక్తులకు ఇస్కాన్ భజన మందిరం నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.