చరిత్రలో దామోదరం సంజీవయ్య..చెరగని ముద్ర
1 min read
ఘనంగా సంజీవయ్య 53 వర్ధంతి వేడుకలు
దామోదర్ చిత్రపటానికి మాల మహానాడు నివాళులు..
నందికొట్కూరు, న్యూస్ నేడు: భారత దేశ రాజకీయ చరిత్రలో దామోదరం సంజీవయ్య చెరగని ముద్ర వేసుకున్నారని నీతి నిజాయితీకి నిలువుటద్దం నిస్వార్ధ ప్రజా సేవకు నిలువెత్తు సాక్ష్యం అని మాల మహానాడు అధ్యక్షుడు పబ్బతి శివ ప్రసాద్ అన్నారు.బుధవారం పట్టణంలోని స్థానిక మాల మహానాడు కార్యాలయంలో దామోదరం సంజీవయ్య 53వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ మునయ్య, సుంకులమ్మ దంపతులకు సంజీవయ్య జన్మించాడని ఆయన జీవితం ఎంతోమందికి ఆదర్శప్రాయం అన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అని కొనియాడారు.అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దాదాపు మూడు దశాబ్దాలు పాటు కొనసాగారని ఎన్నో ఉన్నత పదవులు పొందారని కేంద్ర స్థాయిలో కార్మిక మరియు పరిశ్రమల మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6 లక్షల ఎకరాల భూ పంపిణీకి శ్రీకారం పేదలకు భూ పంపిణీ చేశారని గుర్తు చేశారు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగాల్లో ప్రమోషన్లు మరియు రిజర్వేషన్ లకై 1961లో ఉత్తర్వులు పంపిన నాయకుడు,దేశ ఐక్యతకోసం ఎస్సీ,ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతకోసం ఎంతో కృషి చేసి ఒక సంస్థను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నాగన్న, ఉపాధ్యక్షులు విల్సన్, తాలూకా ఉపాధ్యక్షులు రాజు, మాల మహానాడు సీనియర్ నాయకులు నాగేంద్ర,పరమేష్,పాలమర్రి నాగరాజు,మల్లికార్జున,ఫ్రాంచి స్ తదితరులు పాల్గొన్నారు.