NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దామోదరం సంజీవయ్య జీవితం స్పూర్తిధాయకం

1 min read

ఆద‌ర్శప్రాయులు దామోద‌రం సంజీవ‌య్య

జాయింట్ క‌లెక్టర్ పి.ధాత్రిరెడ్డి

పల్లెవెలుగు,ఏలూరుజిల్లా ప్రతినిధి: నిజాయితీకి, నిరాడంబరత్వానికి, విలువలకు మారుపేరైన దామోదరం సంజీవయ్య అందరికి ఆదర్శప్రాయులని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి పేర్కొన్నారు. మాజీ ముఖ్య‌మంత్రి దామోద‌రం సంజీవ‌య్య జ‌న్మదినోత్సవం సంద‌ర్భంగా సాంఘీక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో శుక్రవారం జ‌రిగిన కార్యక్రమంలో ఆయ‌న చిత్రప‌టానికి జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి పూల‌మాల‌లు వేసి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా జెసి ధాత్రిరెడ్డి మాట్లాడుతూఅత్యున్నత వ్యక్తిత్వం, ఉన్నత విలువ‌ల‌కు మారుపేరైన దామోద‌రం సంజీవ‌య్య అంద‌రికీ ఆద‌ర్శప్రాయుల‌ని ఆమె కొనియాడారు. రాష్ట్ర ప్రప్రధ‌మ ద‌ళిత ముఖ్యమంత్రి సంజీవ‌య్య జాతికి చేసిన సేవ‌ల‌ను కొనియాడారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని నిరోధక శాఖను ఏర్పాటు చేశారన్నారు.  వారి జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం మన అందరికిగర్వకారణమన్నారు.  కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ‌శాఖ జెడి వి. జయప్రకాష్, సెట్ వెల్ సిఇఓ ప్రభాకరరావు, జిల్లా బి.సి. సంక్షేమ అధికారి ఆర్.వి. నాగరాణి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎన్.ఎస్. కృపావరం, డిఇఓ వెంకటలక్ష్మమ్మ, కలెక్టరేట్ ఏవో నాంచారయ్య, వివిధ శాఖల అధికారులు,  సిబ్బంది పాల్గొన్నారు.

About Author