నీతి నిజాయితీకి మారుపేరు దామోదరం సంజీవయ్య
1 min read– గోనెగండ్లలో ఘనంగా దామోదరం సంజీవయ్య 102 వ జయంతి వేడుకలు…
– నీతివంతమైన సమాజ నిర్మాణం కోసం నిజాయితీగల సంజీవయ్య మనకు ఆదర్శం..
– పదవంటే సంపాదన కాదు బాధ్యతనుకునే వాళ్లను ఎన్నుకుందాం…
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: మండల కేంద్రమైన గోనెగండ్ల లోని ఎస్సీ కాలనీ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో దామోదరం సంజీవయ్య 102వ జయంతిని ఘనంగా నిర్వహించారు. దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తప్పు కళాకారుల సంఘం మండల అధ్యక్షులు మారేస్ అధ్యక్షతన జరిగిన జయంతి కార్యక్రమాన్ని ఉద్దేశించి కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కరుణాకర్ మాట్లాడుతూ నిజాయితీ కి మారుపేరుగా దామోదరం సంజీవయ్య లాంటి నాయకులు మనకు ఆదర్శమన్నారు. సంజీవయ్య స్ఫూర్తితో పదవంటే సంపాదన కాదు, బాధ్యత అనుకునే వాళ్లను ఈ సమాజంలో మనం ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోవాలని,38 సంవత్సరాల వయసులోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా దేశవ్యాప్తంగా కీర్తి గడించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆమోదం సంజీవయ్య గారేనని.. అంతకుమించి నీతి, నిజాయితీ, సేవ అన్నవి వంట పట్టించుకుని మచ్చలేని నాయకుడిగా సమాజం ముందు ఆదర్శంగా నిలిచారన్నారు. నేడు నాయకులు సర్పంచ్, ఎంపీటీసీ, కౌన్సిలర్, ఎమ్మెల్యే లాంటి పదవులు వస్తేనే మేకపోతు గాంబిర్యాన్ని ప్రదర్శించే నాయకులు ఉన్నారని ఉన్నారు. దామోదరం సంజీవయ్య మాత్రం తొలి దళిత ముఖ్యమంత్రిగా పదవి అధిష్టించి ప్రజా సమస్యల కోసమే, ప్రజా ప్రజల అభివృద్ధి కోసమే కృషి చేసిన వ్యక్తి అని అన్నారు. ఇలాంటి నాయకుడు దామోదరం సంజీవయ్య స్ఫూర్తితో ప్రజా సమస్యలపై గలమెత్తి, వెనకబడ్డ ప్రాంతాల సమస్యలను వెలిగెత్తి చాటాలన్నారు. ఆ రకమైన అంతరాలు లేని సమాజ నిర్మాణం కోసం కేవీపీఎస్ అహర్నిశలు కృషి చేస్తుందని, అదే సంజీవయ్య గారికి ఇచ్చే గొప్ప నివాళి అన్నారు. ఈ ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ తిమ్మరసు,లచ్చన్న, మద్దిలేటి, ముని స్వామి,డప్పు కళకారుల సంఘం నాయకులు రంగన్న,నరసింహుడు ,మునిస్వామి, నడిపి రంగన్న , కిష్టన్న , కాటికాపర్ల సంఘం నాయకులు రంగన్న , తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.