PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

త‌ల‌లో ‘చుండ్రు’.. వేపాకుతో అరిక‌ట్టండి

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : త‌ల‌పై చ‌ర్మం పొడిగా ఉండేవారిలో చుండ్రు స‌మ‌స్య ఉంటుంది. చుండ్రు కేవ‌లం త‌ల‌పైనే కాకుండా చ‌ర్మం, ముఖం పై కూడ దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. చుండ్రుకు కార‌ణం పొడి చ‌ర్మం కాదు. మ‌ల‌స్సేజియా అనే శిలీంధ్రాల జాతికి చెందిన ఫంగ‌స్ కార‌ణంగా చ‌ర్మం పై పుడుతుంది. దీని జీవిత‌కాలం చాలా త‌క్కువైన‌ప్పటికీ .. వేగంగా వ్యాపించ‌డం దీని ల‌క్షణం. దీనికి వేపాకుతో చెక్ పెట్టవ‌చ్చని నిపుణులు చెబుతున్నారు. వేప నూనె, వేప షాంపు, వేప హెడ్ ప్యాక్ తో అరిక‌ట్టవ‌చ్చు. కొంచెం కొబ్బరి నూనెలోకి కొన్ని వేపాకులు వేసి మ‌ర‌గించాలి. చ‌ల్లారిన త‌ర్వాత రెండు చుక్కల నిమ్మరసం క‌ల‌పాలి. దీనిని రాత్రిపూట త‌ల‌కు రాసుకుని పొద్దున్నే స్నానం చేయాలి. అలాగే వేప ఆకుల్ని పేస్ట్ గా మార్చుకుని.. పెరుగులో క‌లిపి త‌ల‌కు ప‌ట్టించుకోవాలి. 20 నిమిషాల త‌ర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు స‌మ‌స్య త‌గ్గే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

About Author