డేంజర్ బెల్..!
1 min readనందికొట్కూరు @ 16 కేసులు
– మహారాష్ట్ర కూలీలకు సోకిన కరోనా..
పల్లెవెలుగు వెబ్, నందికొట్కూరు: నందికొట్కూరు మున్సిపాలిటీలో కరోనా డేంజర్ బెల్ మోగింది. ఇప్పటి వరకు పట్టణంలో 12 కరోనా కేసులు నమోదు కాగా.. మిడుతూరు మండలం జలకనూరులో 4 కేసులు నమోదయ్యాయి. ఇందులో నలుగురు విద్యార్థులు ఉన్నారు. .అధికారుల సమాచారం మేరకు.. మహారాష్ట్రకు చెందిన 72 మంది కూలీలు , కాంట్రాక్టర్లు పట్టణంలో ఓ అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. అలాగే ఉత్తర ప్రదేశ్, బీహార్ నుంచి వచ్చిన కూలీలు 13 మంది మరో చోట అద్దెకు ఉంటున్నారు. వీరు మిడుతూరు మండలం జలకనూరు, పాములపాడు మండలం రుద్రవరం, నందికొట్కూరు పట్టణంలో వివిధ కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు. ఇప్పటి వరకు 66 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి క్రిష్ణమూర్తి తెలిపారు. మహారాష్ట్ర కూలీలు ఉంటున్న అద్దె భవనానికి అతి సమీపంలో ఒక ప్రవేట్ పాఠశాల, భోజనం హోటల్స్, సినిమా థియేటర్ ఉన్నాయి. దీనితో పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.