కుటుంబీకులతో… ప్రాణహాని..
1 min read
రక్షణ కల్పించండి..
- ఎస్పీని కోరిన యువతి
కర్నూలు, పల్లెవెలుగు:తాము ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమ వివాహం చేసుకున్నామని, తమకు రక్షణ కల్పించాలని ఓ ప్రేమ జంట కర్నూలు ఎస్పీని ఆశ్రయించింది. మామిదాలపాడుకు చెందిన సుమన్, పొలకల్ కు చెందిన భారతి సోమవారం హైదరాబాద్ లోని ఆర్య సమాజంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన తాము బి.టెక్ చదవామని, తమ పెళ్లికి పెద్దల అంగీకారం లేకపోవడంతో రక్షణ కల్పించాలని ప్రేమ జంట ఎస్పీని ఆశ్రయించారు. సోమవారం సాయంత్రం డీఎస్పీ బాబు ప్రసాద్ నేతృత్వంలో కౌన్సిలింగ్ ఇచ్చి…ఆ తరువాత తాలూకా పోలీస్ స్టేషన్ కు కేసు ను రెఫర్ చేస్తూ… సీఐకి ప్రేమ జంటను అప్పగించారు.