చైనాలో ప్రమాదకర కరోన వేరియంట్లు
1 min readపల్లెవెలుగువెబ్: కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో.. అత్యంత వేగంగా విస్తరించే గుణమున్న మరో రెండు ప్రమాదకర కరోనా వేరియంట్లు వెలుగు చూశాయి. ఒమిక్రాన్ బీఎఫ్.7, బీఏ.5.1.7 అనే ఈ కొత్త రకాలకు అత్యంత వేగంగా విస్తరించే లక్షణాలున్నట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు. దీంతో రానున్న శీతాకాల సీజన్ లో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా పెరగొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త వేరియంట్లతో చైనాలోని మరిన్ని ప్రాంతాలకు కరోనా కేసులు విస్తరించొచ్చని నిపుణులు భావిస్తున్నారు. బీఏ.5.1.7 కేసులను గ్వాంగ్ డాన్ ప్రావిన్స్ లోని షౌగన్ పట్టణంలో గుర్తించారు. బీఎఫ్.7 కేసులను షౌగన్ తో పాటు, యాంటాయ్ పట్టణంలో గుర్తించారు. ఈ రెండూ కరోనా వేరియంట్లు గత వేరియంట్ల తాలూకూ రోగనిరోధక వ్యవస్థ కళ్లు గప్పుతాయని చైనా ప్రభుత్వం అంటోంది.