వతన్ నిహార్కు.. దర్గా కమిటీ ఆహ్వానం
1 min read
అన్నమయ్య జిల్లా బ్యూరో, పల్లెవెలుగు: అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని బండ్లపెంటలో వెలసిన హజరత్ హసన్ దాదా షావలి ఉరుసు ఉత్సవాలలో పాల్గొనాలని కోరుతూ దర్గా కమిటీ చైర్మన్ మహమ్మద్ షరీఫ్ గురువారం రాజంపేట పార్లమెంటరీ టిడిపి అధికార ప్రతినిధి వతన్ నిసార్ కు ఆహ్వాన పత్రికను అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంధం రోజు హసన్ దాదా భక్తులకు అన్నదాన కార్యక్రమం, ఉరుసు రోజు టీవీ గాయని గాయ కులచే సంగీత ఖవ్వాలి ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా టిడిపి నేత వతన్ నిసార్ మాట్లాడుతూ దర్గా కోసం తనవంతు సహయసహాకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దర్గా ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.