శ్రీ స్వామినరేంద్ర చార్య మహారాజ పాదరక్షల దర్శనం
1 min readపల్లెవెలుగు వెబ్: శ్రీ విభూషిత జగద్గురు రామానందతీర్థ శ్రీ స్వామినరేంద్ర చార్య మహారాజ పాద రక్షల దర్శన భాగ్యం కోసం ప్రజలు భారీగా తరలివచ్చారు. మంగళవారం ఉదయం కర్ణాటక రాష్ట్రం రాయచూరులోని శ్రీ గీతామందిరం నుంచి గురుజీ చిత్రపటం, పాదరక్షలను కలశాలు, మేళతాళాలతో అంగరంగ వైభవంగా తీసుకెళ్లారు. భక్తుల దర్శనార్థం… గీతామందిరం నుంచి సిటీటాకీస్, బసన్న బావి సర్కిల్, గద్వాల రోడ్డు, మున్నూరు కాపు శ్రీ వీరాంజనేయ కళ్యాణ మండపం వరకు గురుజి చిత్రపటం, పాదరక్షలను గురుజి శిష్యులు తీసుకెళ్లారు. కళ్యాణ మండపంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆ తరువాత ప్రవచనాలు చదివి వినిపించారు. గురుజీ పాదరక్షలకు 50 మంది జంటలు పూజలు చేశారు. రాయచూరు ఎమ్మెల్యే డా. శివరాజ్ పటేల్, మున్సిపల్ చైర్మన్ లలిత కడగోల్ ఆంజనేయ, నగర వైస్ చైర్మన్ సరోజమ్మ, దొడ్డు మల్లేశప్ప, నర్సిరెడ్డి, ఎన్. శ్రీనివాస రెడ్డి, మార్కెట్ యార్డు కమిటీ మాజీ చైర్మన్ కె.శాంతప్ప, వై. గోపాల్ రెడ్డి, మాణిక్యశెట్టి, బంకాపుర ఎల్లప్ప, మహేంద్ర, గోపాల్, కడగోల్ రామచంద్ర, చంద్రశేఖర్, ఆర్.పి. వెంకటేష్, కె. శరణప్ప, కె. బూదెప్ప, మెటికల నరసింహులు, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.