PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ‌యోపిక్ గా దాస‌రి జీవితం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ రావు జీవితం బ‌యోపిక్ గా రాబోతోంది. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు ద‌వ‌ళ స‌త్యం ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాడివా ర‌మేష్ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించి ముందస్తు నిర్మాణ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా సాగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ద‌వ‌ళ స‌త్యం మాట్లాడుతూ.. ‘చిత్ర పరిశ్రమలో మేరు శిఖరం అంత ఎత్హుకు ఎదిగి, రచయితగా, దర్శక, నిర్మాతగా ఎందరెందరికో మార్గదర్శకుడైన దాసరి గారితో నాకున్న విడదీయలేని అనుబంధం ఈ చిత్రం చేసేందుకు నన్ను పురిగొల్పింది. దాంతో నాకు తెలిసిన,, ఆయన జీవితంలో నేను చూసిన అనేక సంఘటనలతో పాటు, ఆయనతో అనుబంధం ఉన్న అనేకమందిని సంప్రదించి, ఈ చిత్రం స్క్రిప్ట్ ను అద్భుతంగా రూపకల్పన చేయడం జరుగుతోంది. తప్పకుండా దీనిని ఓ గొప్ప చిత్రంగా తెరకెక్కించేందుకు, దాసరి గారి పట్ల ఎనలేని అభిమానంతో తాడివాక రమేష్ నాయుడు ముందుకు రావడం అభినందనీయం’ అని అన్నారు.

                                          

About Author