టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా దాసెట్టి శ్రీనివాసులు
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కర్నూలు నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది దాసేట్టి శ్రీనివాసలు నియామకం అయ్యారు. కర్నూలు నగరానికి చెందిన దాసెట్టి గత 30 సంవత్సరాలుగా న్యాయవా దిగ విధులు నిర్వహిస్తూ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా, సెక్రటరీగా, నోటరీగా ఎన్నో పదవులు గతం లో నిర్వహించారు. అనంతరం ఎస్సీ,ఎస్టీ స్పెషల్ పబ్లిక్ ప్రాసి కుటర్ గా విధులు న్యాయస్థానం లో పనిచేశారు. ఒకవైపు తన వృత్తి నిర్వర్తిస్తూనే మరో వైపు తాను పుట్టిన రాయలసీమ ప్రాంత వెనుకబాటు తనాన్ని అంతమొందించాలనే లక్ష్యం తో రాయలసీమ హక్కుల ఐక్య వేదిక ద్వారా రాయలసీమ జిల్లలో పర్యటించి సీమ వెనుకబాటు ను ఎలా ఎదుర్కోవలో ఎన్నో సమీక్ష సమావేశాలు,మేధావుల తో సమావేశాలు నిర్వహించి ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర సాధనే లక్ష్య0గా తన కార్యాచరణను రూపొందించుకున్నారు. ప్రసుతం తెలుఫుదేశం పార్టీ కర్నూలు నియోజకవర్గ ఇంచార్జి టీజీ భరత్ అడుగుజాడల్లో ఒక కార్యకర్త గా తెలుగుదేశం పార్టీ ని తిరుగి అధికారం లోకి తీసుకువచ్చేందుకు, టీజీ భరత్ ను కర్నూలు ఎమ్మెల్యే గా చేసేందుకు అహర్నిశలు కృషిచేస్తున్న న్యాయవాదీ దాసెట్టి శ్రీనివాసులు కు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా పదవి దక్కడం తో కర్నూలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు , టీజీబీ యూత్ సభ్యులు, ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెదేపా పెద్దలకు ధన్యవాదాలు… దాసెట్టి..
తన సేవలను గుర్తించి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పదవి బాధ్యతలను అప్పజెప్పినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయడు, జాతీయ ఉపాధ్యక్షుడు నారా లోకేష్ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, మూందునుంది తన అబివృద్ది కోసం అన్ని విధాలా సహకరిస్తున్న ప తెలుగు దేశం పార్టీ కర్నూలు అసెంబ్లీ ఇంచార్జి టీజీ భరత్ కుటుంబానికి, రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులకుటీం కు దాసెట్టి ఈ సందర్బంగా ప్రత్యేక కృతజ్ఞతలు ,అభినందనలు తెలిపారు.