PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భక్తిశ్రద్ధలతో దస్తగిరి స్వామి గ్యార్మీ వేడుకలు

1 min read

పల్లెవెలుగు, వెబ్  చాగలమర్రి : చాగలమర్రి లోని ఖల్లగడ్డ వీధిలో వెలసిన శ్రీ హజరత్ దస్తగిరి స్వామి గ్యార్మీ  వేడుకలు సోమవారం ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబూలాల్, పాల్గొని దస్తగిరి స్వామికి ప్రత్యేక ఫాతెఃహాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు ముల్లా రఫీ, వైసిపి నాయకులు ముల్లా ఖాదర్బాషా, షేక్ షబ్బీర్, ముల్లా ఇబ్రహీం, లడ్డు భాష, మహమ్మద్, అమీర్ సాహెబ్, చాకలి రమణ, సుబ్బరాయుడు, వైసీపీ మండల ప్రచార కార్యదర్శి పెయింటర్ రఫీ తదితరులు పాల్గొన్నారు.

About Author