PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ స్వామి అమ్మవార్లకు దవనోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్​: ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమిరోజు సాయంకాలాన స్వామి అమ్మవార్లకు దవనోత్సవాన్ని సమర్పించడం సంప్రదాయం. చైత్రపౌర్ణమి సందర్భంగా  సాయంకాలం దవనోత్సవం దేవస్థానం వారు నిర్వహించారు. ఈ కార్యక్రమములో  భాగంగా సంప్రదాయాన్ని అనుసరించి ఆలయ రాజగోపురానికి ఎదురుగా అగ్నిప్రతిష్టాపన చేసి ఆజ్యం, దవనం, గుగ్గిలం ఆహుతిగా వేసి శ్రీస్వామి అమ్మవార్లకు ధూపసమర్పణ చేయబడుతుంది. ఈ దవనోత్సవంలో ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠిస్తారు. తరువాత శాస్త్రోక్తంగా అగ్నిప్రతిష్టాపనాది కార్యక్రమాలు జరిపి ధూపసమర్పణ జరిపించ బడుతుంది. కాగా ప్రతి సంవత్సరం ఈ దవనోత్సవంలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

About Author