కాంగ్రెస్ ఆస్తులను డిసిసి కబ్జా చేశారు..
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/15-4.jpg?fit=550%2C309&ssl=1)
పిసిసి అధ్యక్షురాలు కు సీనియర్ నాయకులు, కార్యకర్తలకు తెలియకుండా కుట్రలు
క్రిమినల్ కేసులు నమోదు, చేసి జైలుకు పంపాలి
పీసీసీ ఆదేశాలతో కేసు నమోదు..
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎఐసిసి సభ్యులు, కాంగ్రెస్ నంద్యాల పార్లమెంటు జిల్లా డిసిసి అధ్యక్షులు .మాజీ డిసిసి, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ధ్వజం.
పల్లెవెలుగు వెబ్ కర్నూల్: జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆస్తులను డిసిసి మురళీకృష్ణ కబ్జా చేశాడని ఎఐసిసి సభ్యులు, నంద్యాల పార్లమెంట్ డిసిసి అధ్యక్షులు జె. లక్ష్మీ నరసింహ యాదవ్ ధ్వజమెత్తారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ డిసిసి బాబురావు, నగర అధ్యక్షులు జిలాని భాష , ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు బ్రతకన్నా సీనియర్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళా వెంకట్రావు భవాని పేరుతో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఓ సొసైటీని ఏర్పాటు చేసి ఆస్తులకు తనే యజమానిగా సృష్టించుకునేందుకు కుట్రలు పన్నారని ఆరోపించారు. సొసైటీ లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గుమస్తాలు, స్వీపర్లను సభ్యులుగా చేర్చడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రాష్ట్ర,జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు తెలియకుండా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం తో కుట్ర కోణం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. పిసిసి షర్మిల రెడ్డి ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు సంబంధించిన ఆదాయ వనరులను రాష్ట్ర పీసీసీ అకౌంట్ కు జమ చేయాలని ఆదేశించారు. గత 70 సంవత్సరాలుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సంబంధించిన ఆదాయ వేయాలి కాంగ్రెస్ పార్టీ అవసరాలకు మాత్రమే వినియోగించేవారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవన సమీపంలో 15 భవనాలకు సంబంధించి అద్దె రూపంలో ప్రతినెల 1,87,000 వసూలు చేసుకుని సొంత అవసరాలకు వాడుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.గత పిసిసి గిడుగు రుద్దరాజు ఆదేశాల మేరకు ప్రస్తుత పిసిసి వైఎస్ షర్మిల రెడ్డి గారు అమలు చేసేందుకు ప్రతి డీసీసీ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను ధిక్కరిస్తూ జిల్లా డిసిసి మురళీకృష్ణ తన సొంత ఖాతాను సృష్టించుకుని, పైగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేరుతో ఓ సొసైటీని ఏర్పాటు చేసి పార్టీ ఆస్తులనే కబ్జా చేసేందుకు ప్రయత్నించిన విధానాన్ని జిల్లా, రాష్ట్ర నాయకత్వం తప్పు పడుతుందని తెలిపారు. గత రెండు రోజులుగా పిసిసి ఆదేశాల మేరకు మురళీకృష్ణ చేసిన అక్రమాలను వివరాలతో సహా నివేదించామని తెలిపారు. పీసీసీ కార్యాలయం ఆదేశాల మేరకు విలేకరుల సమావేశం నిర్వహించి నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో డీసీసీ మురళీకృష్ణ సొసైటీలోని సభ్యుల పైన చీటింగ్ కేసు నమోదు చేశామని తెలిపారు. వీరిపై వెంటనే కఠిన చర్యలు తీసుకునేంతవరకు తమ పోరాటం చేస్తామని, రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సొసైటీని వెంటనే రద్దు చేయాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని ఆస్తులను కాపాడుకునే
విషయం తెలిసి ఆశ్చర్యపోయాం.. జిలాని భాషా నగర అధ్యక్షులు
జిల్లా కేంద్రంలో ఉన్న తమకే తెలియకుండా .. నగర అధ్యక్షుడిగా తనకు తెలియకుండా.సొసైటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసి నీవే రాయాం. పార్టీని కాపాడమని బాధ్యతలు అప్పగిస్తే పార్టీ ఆస్తులను కబ్జా చేయడం దుర్మార్గమైన చర్య. ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరు ఖండించాలి వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం.
పీసీసీ ఆదేశాలను ధిక్కరించడమా. బి బ్రతుకన్నా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు
పీసీసీ ఆదేశాలను ధిక్కరిస్తూ నెలనెలా వచ్చే అద్దెలను దుర్వినియోగం చేయడమే కాక ఆస్తులను కబ్జా చేయడం దుర్మార్గం. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు పోరాటం చేస్తాం.
అక్రమార్కులు వెంటనే వెళ్లిపోండి -అనంతరత్నం మాదిగ
అక్రమాలకు పాల్పడిన వారి వెంటనే కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లకపోతే దెబ్బలు పడతాయని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఆస్తులను కాపాడుకునే బాధ్యత ప్రతి కార్యకర్త పై ఉంది కార్యకర్తలు నాయకులు తిరగబడక ముందే బాధ్యతల నుంచి తప్పుకొని అందరూ వెళ్లిపోవాల్సిందే. సొసైటీలో ఉన్న వారందరికీ దేహశుద్ధి చేస్తాం లేదంటే న్యాయపోరాటం చేస్తాం. ఈ కార్యక్రమంలో ముసిద్ పీర్ ఖాద్రి రియాజ్ రజాక్ వలి జాకీర్ హుస్సేన్ బాలస్వామి పఠాన్ అబూ ఖాన్ విశ్వేశ్వర్ రెడ్డి చెన్నయ్య జాన్ సదానందం వెంకటరెడ్డి లాజరస్సు అబ్దుల్ హై.