అవినీతి నిరోధక శాఖ వలలో డిఈ మహాలక్ష్మి
1 min readపల్లెవెలుగు వెబ్: జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ డీఈ మహాలక్ష్మి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. స్వీపర్ నుంచి లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు పట్టుబడ్డారు. ఇటీవల జీహెచ్ఎంసీ స్వీపర్ సాలెమ్మ మరణించారు. ఆమె ఉద్యోగం భర్తకు ఇచ్చేందుకు లంచం అడిగారు. సాలెమ్మ భర్త 20 వేలు లంచం ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో మల్లాపూర్ లోని ఓ హోటల్లో 20 వేలు లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కారు. డీఈ మహాలక్ష్మి ఇంట్లో అనిశా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.