PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘోర అగ్నిప్ర‌మాదం… 19 మంది మృతి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అమెరికాలోని న్యూయార్క్ న‌గ‌రంలో ఘోర అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఓ అపార్ట్ మెంట్ లో సంభ‌వించిన అగ్నిప్ర‌మాదంలో 9 మంది పిల్ల‌ల‌తో స‌హా మొత్తం 19 మంది మ‌ర‌ణించారు. ఇటీవ‌ల కాలంలో జ‌రిగిన అత్యంత ఘోర అగ్నిప్ర‌మాదాల్లో ఇదొక‌టిగా న్యూయార్క్ న‌గ‌ర అగ్నిమాప‌క క‌మీష‌న‌ర్ పేర్కొన్నారు. ఈ అగ్నిప్రమాదంలో మరో 60 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 13 మంది పరిస్థితి విషమంగా ఉందని రెంగెల్ చెప్పారు. అగ్నిప్రమాదం వల్ల వెలువడిన పొగ పీల్చడం వల్ల పలువురు మరణించారని అగ్నిమాపక శాఖ కమిషనర్ డేనియల్ నిగ్రో చెప్పారు. తూర్పు 181వ వీధిలోని 19-అంతస్తుల భవనం అయిన బ్రోంక్స్ ట్విన్ పార్క్ అపార్ట్‌మెంట్స్‌లో చెలరేగిన మంటలను ఆర్పడానికి 200 మంది అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన తరలివచ్చారు.

                                        

About Author