PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతులకు నాణ్యమైన సలహాలందించి వారి వృద్దికి డీలర్లు దోహదపడాలి

1 min read

– నంద్యాల  జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి.

– 48 వారాల పాటు డిప్లొమా కోర్సు నిర్వహణ.

– 2023..2024 బ్యాచ్ క్రింద జిల్లాలో 40 మంది డీలర్లకు శిక్షణ.

– దేశీ కోర్సును లాంఛనంగా ప్రారంభించిన జిల్లా జాయింట్  కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు : నంద్యాల  జిల్లాలో ఉన్న విత్తన, ఎరువుల క్రిమి సంహారక డీలర్లు రైతులకు నాణ్యమైన సలహాలందించి వారి వృద్దికి దోహదపడాలని, నూతన సాగు విధానాలు, విత్తనాలు, క్రిమి సంహారక, తదితర అంశాల పై పూర్తి అవగాహన పొందాలని నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి  అన్నారు. నందికొట్కూరు పట్టణంలోని ప్యారడైజ్ పంక్షన్ హాల్ నందు  నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్ (దేశీ) కార్యక్రమంలో  నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి  పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి దేశీ కోర్సును లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా జాయింట్  కలెక్టర్ మాట్లాడుత దేశీ కోర్సులో కనీసం 10 ప్రామాణిక పరీక్షలకు హాజరైన ప్రాక్టీస్ చేసే ఇన్‌పుట్ డీలర్‌లందరికీ అందుబాటులో ఉంటుందన్నారు. 2023,2024 సంవత్సరం 40 మంది డీలర్లను ఎంపిక చేసి 48 వారాల పాటు ప్రత్యేక శిక్షణ అందించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులను పారా ఎక్స్‌టెన్షన్ నిపుణులుగా మార్చడం ద్వారా క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలను పరిష్కరించడం ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని అన్నారు. ప్రతివారం మార్కెట్ సెలవు రోజు తరగతులు నిర్వహిస్తామని, 48 వారాలపాటు తరగతులు, 8 వారాలు క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. డిప్లొమా కోర్సు డీలర్ల కోసం ప్రత్యేక ఆలోచనతో రూపొందించడం జరిగిందని, క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంటూ వారికి మెరుగైన సలహాలు డీలరు అందించాల్సి ఉంటుందని అందుకోసం పరిజ్ఞానం పెంచుకోవాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు. డీలర్లు అనుభవంతో పాటు శాస్త్రీయ కారణాలతో రైతులకు వివరంగా మంచి సలహాలు చెప్పగలిగితే ఉత్తమమైన ఫలితాలు వస్తాయని, రైతులకు మెరుగైన సేవ చేసినట్లవుతుందని జాయింట్ కలెక్టర్ తెలిపారు. కర్నూలు జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్, ఆత్మ మరియు జిల్లా వ్యవసాయ అధికారి పి.లలిత వర లక్ష్మీ. నంద్యాల జిల్లావ్యవసాయ అధికారి మోహన్ రావు, నందికొట్కూరు ఏడీఏ సి. విజయ్ శేఖర్, అసోసియేట్ డైరెక్టర్ ఫర్ రీసెర్చ్ ప్రాంతీయ పరిశోధన సంస్థ వెంకటేశర్లు,   ప్రధాన కీటక శాస్త్రవేత్త డాట్ సెంటర్ రామకృష్ణ రావు, శాస్త్రవేత్త  మంజునాథ్,సహాయ వ్యవసాయ సంచాలకులు కర్నూలు జిల్లా మానవ వనరుల సెంటర్ వెంకటేశ్వర్లు.  నంద్యాల జిల్లా సహాయ వ్యవసాయ సంచాలకులు బయో కంట్రోల్ ల్యాబ్ సుధాకర్, గేమరాజు నరసింహారావు  విశ్రాంత డీన్ ఆచార ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, కె .మధుమతి అగ్రికల్చర్ ఆఫీసర్ ఆత్మ కర్నూల్ , యోగి రెడ్డి విశ్రాంత సహాయ సంచాలకులు నంద్యాల,జూపాడుబంగ్లా ,మిడుతూరు, నందికొట్కూరు మండల వ్యవసాయ అధికారులు కృష్ణా రెడ్డి, పీరు నాయక్ ,షేక్షావలి,చిట్యాల రామేశ్వర రెడ్డి దేశి ఫెసిలిటేటర్ నందికొట్కూరు ,నందికొట్కూరు మండలం విత్తనములు ఎరువులుమరియు పురుగుమందుల డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు గౌరీశ్వర నాయుడు, మంది దేశి శిక్షణ  అభ్యర్థులు మరియు  సిబ్బంది తదితరులు   పాల్గొన్నారు.

About Author