PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డెత్.​.కేసులే.. టార్గెట్​..!

1 min read
వివరాలు వెల్లడిస్తున్న ఎస్​ఐ శరత్​ కుమార్​

వివరాలు వెల్లడిస్తున్న ఎస్​ఐ శరత్​ కుమార్​

– ప్రమాద బీమా, సీఎం సహాయ నిధి వర్తిస్తుందని… డబ్బులు వసూలు
– డీఎస్పీనంటూ.. చెలామణి..
– మూడేళ్లు జైలు శిక్ష, రూ.20వేలు జరిమానా విధించిన పత్తికొండ కోర్టు
పల్లెవెలుగు వెబ్​, గోనెగండ్ల: ప్రమాదవశాత్తు, వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబాలనే టార్గెట్​ చేస్తూ.. డబ్బులు వసూలు చేసే.. నకిలీ డీఎస్పీకి శుక్రవారం మూడేళ్లు జైలు శిక్ష, రూ.20 వేలు జరిమానా విధించింది పత్తికొండ కోర్టు. వివరాలిలా ఉన్నాయి. మిడుతూరు మండలం కనుమూరు గ్రామానికి చెందిన యేసయ్య కుమారుడు కిరణ్ కుమార్ అలియాస్ రవికుమార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సహజంగా మరణించిన, ఆత్మ హత్యలు చేసుకున్న వ్యక్తుల జాబితా ను సేకరించి.. సైబర్​ చోరీలకు పాల్పడేవాడు. మండలకేంద్రమైన గోనెగండ్ల పంచాయతీలో ట్రాక్టర్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న జి. మల్లయ్య గత ఏడాది ఏప్రిల్ లో గుండెపోటుతో మరణించాడు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 7లక్షల42 వేల రూపాయలు నామిని ఖాతాలో జమ చేస్తున్నామని, నగదుకు జిఎస్టి చెల్లించాల్సి ఉంటుందని, జి ఎస్ టి నగదును తన ఖాతాలో జమ చేయాలని చెప్పడంతో.. సదరు కుటుంబీకులు నకిలీ డీఎస్పీ ఖాతాలో రూ.36వేలు గూగుల్​ పే ద్వార జమ చేశారు. ఆ తరువాత రవికుమార్ స్విచ్చాఫ్​ రావడంతో గోనెగండ్ల పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదుచేశారు. అప్పటి నుంచి కర్ణాటక లోని రాయచూరు, బళ్లారి, హుబ్లీ,మంగుళూరు, బెంగుళూరు తదితర ప్రదేశాల్లో తిరుగుతున్న నేరస్తుడిని పట్టుకుని గతేడాది నవంబన 2న అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.


మూడేళ్లు జైలు శిక్ష…
ఈ నెల తొమ్మిదో తేదీ పత్తికొండ కోర్టులో సైబర్ నేరస్తుడికి మూడు సంవత్సరాల జైలు శిక్ష,20వేల రూపాయలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ముద్దాయి ఆచూకీ కనుగొనడంలో ప్రతిభ కనబరచిన అప్పటి కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పార్థసారథి రెడ్డి, పోలీస్ సిబ్బంది రంగ రావులను తోటి పోలీసులు అభినందించినట్లు ప్రస్తుత ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి తెలిపారు.

About Author