ఆగస్ట్ 15 తర్వాత ఆమరణ నిరాహార దీక్ష
1 min read
పల్లెవెలుగువెబ్ : విభజన హామీల అమలు కోసం వచ్చే బుధవారం ఉదయం జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వెల్లడించారు. విభజన హామీలు అమలు చేయకపోతే ఆగస్టు 15 తరువాత ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు. తెలుగు సత్తా చూపకపోతే విభజన హామీలు అమలు కావన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం లక్ష 65 వేల కోట్ల మేర బకాయలు ఉన్నాయని కేఏ పాల్ పేర్కొన్నారు.