NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మ‌నం శ‌త్రువులం కాదు.. మా గొంతుక వినండి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్ పై ర‌ష్యా యుద్ధానికి దిగిన వేళ ఉక్రెయిన్ అధ్య‌క్షుడు శాంతి సందేశం పంపారు. త‌మ బాధ‌ను అర్థం చేసుకోవాల‌ని ప్ర‌త్య‌ర్థి ర‌ష్యా ప్ర‌జ‌ల‌ను కోరారు. త‌మ జాతిని, ర‌ష్యా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి జెలెన్ స్కీ భావోద్వేగంగా ప్ర‌సంగించారు. ‘మా గొంతుకను వినండి… ఉక్రెయిన్‌ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. ఉక్రెయిన్‌ అధికారులు శాంతిని కాంక్షిస్తున్నారు. మాకు యుద్ధం ఏమాత్రం అవసరం లేదు’’ అంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్‌ జెలెన్‌స్కీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తమ జాతిని, రష్యా ప్రజలను ఉద్దేశించి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు.“ ‘‘యుద్ధం అంటే బాధ, బురదలో కూరుకుపోవడం, రక్తపాతం, వేలాది మంది మరణాలు. మాపై దాడి చేయడం ద్వారా మమ్మల్ని దెబ్బకొట్టాలని చూస్తున్నారు. మేము మాత్రం యుద్ధం కోరుకోవడం లేదు’’ అని రష్యన్‌ భాషలో ప్రసంగించారు. ‘‘మనం శత్రువులం కాదు.. అయితే ఆత్మరక్షణలో భాగంగా మేము కూడా ప్రతిదాడి చేయాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

                                    

About Author