NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మ‌రికొన్ని గంట‌ల్లో మ‌ర‌ణ శిక్ష.. కరోన సోక‌డంతో వాయిదా !

1 min read

పల్లెవెలుగు వెబ్​: భార‌త సంత‌తికి చెందిన మ‌లేసియా వాసి నాగేంద్రన్ ధ‌ర్మలింగానికి మాద‌క‌ద్రవ్యాల అక్రమ‌ర‌వాణ కేసులో సింగ‌పూర్ కోర్టు మ‌ర‌ణ శిక్ష విధించింది. బుధ‌వారం రోజున అక్కడి చాంగీ జైల్లో మ‌ర‌ణ‌దండ‌న ఎదుర్కొనున్నాడు. అదే స‌మ‌యంలో త‌న మాన‌సిక స్థితి బాగాలేనందున మ‌ర‌ణ‌శిక్ష నిలిపివేయాలంటూ సోమవారం నాడు కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. వీటిని తోసిపుచ్చిన న్యాయ‌స్థానం.. అప్పీలుకు వెళ్లేందుకు ఒక‌రోజు స‌మ‌యం ఇచ్చింది. దీనిపై మంగ‌ళ‌వారం నాడు మ‌లేసియా కోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ఇదే స‌మ‌యంలో నాగేంద్రన్ కు కోవిడ్ నిర్దార‌ణ అయిన‌ట్టు జైలు అధికారులు న్యాయ‌వాదుల‌కు తెలిపారు. దీంతో బుధ‌వారం నాటి ఉరిశిక్షను కోర్టు తాత్కాలికంగా వాయిదా వేసింది.

About Author