మరణం లేని మహానేత… ఎన్టీఆర్
1 min readపల్లెవెలుగు వెబ్, అన్నమయ్య జిల్లా రాయచోటి: జిల్లా పరిధిలోని దిగువ అబ్బవరంలో బుధవారం మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు 27 వ వర్ధంతి సదర్భంగా ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు మాజీ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ రెడ్డి, మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు సుగువాసి ప్రసాద్ బాబు. అనంతరం పార్టీ కార్యాలయంలో టిడిపి కుటుంబ సభ్యుల మధ్య స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి 27 వ వర్ధంతి సందర్బంగా NTR చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాలులు అర్పించిన టిడిపి నాయకులు ప్రసాద్ బాబు,మైనారిటీ నాయకులు,టీడీపీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు..ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజల గుండెల్లో స్తిర స్తాయిగా నిలచిన మహా నేత నంధమూరి తారక రామారావుగారు ఆన్నారు.
ఘనంగా ప్రసాద్ బాబు జన్మదిన వేడుకలు
.రాయచోటిలో గాలివీడు రోడ్డు ప్రీతం రెసిడెన్సీ సమీపంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి నాయకులు, పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తల నడుమ అంగరంగ వైభవంగా ప్రారంభంమైన సుగవాసి ప్రసాద్ బాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. మొక్కలు నాటి జన్మదిన వేడుకలలో ప్రసాద్ బాబు పాల్గొన్నారు. నియోజకవర్గం లోని అన్ని మండలాల నుండి తరలివచ్చిన ప్రజా, విద్యార్థి, మైనార్టీ సంఘాలు,బడుగు బలహీనవర్గాలు మరియు టీడీపీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు…అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్త యువత…ప్రసాద్ బాబు జన్మదిన సందర్బంగా పార్టీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మేఘా రక్త దాన శిభిరం, అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. సుమారు మూడు వందల మందికి పైగా రక్తదానం దానం చేసిన యువకులు, కార్యకర్తలు, అభిమానులు…తనకి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపిన టి టి డి మాజీ పాలకమండలి సభ్యుడు,రాయచోటి టిడిపి నాయకులు శ్రీసుగవాసి ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు.