NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘నా’ అనుకున్నవాళ్లతోనే మోస‌పోయా

1 min read

– సీనియర్​ నటుడు రాజేంద్ర ప్రసాద్
దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబంలో పుట్టి.. హాస్య భ‌రిత పాత్రలతో ప్రేక్షకుల్ని అల‌రించారు న‌ట‌కిరీటి రాజేంద్ర ప్రసాద్. ఆయ‌న న‌టించిన క్లైమాక్స్ చిత్రం త్వర‌లో విడుద‌ల కాబోతోంది. భ‌వాని శంక‌ర్ ద‌ర్శకుడు. ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకుని ఎంతో పేరు ప్రతిష్టల్ని సంపాదించాన‌ని.. కానీ త‌న సొంత వాళ్ల చేతిలో మోస‌పోయానని ఆవేద‌న వ్యక్తం చేశారు రాజేంద్ర ప్ర‌సాద్. త‌న ర‌క్త సంబంధీకుల్ని న‌మ్ముకుని త‌న ఆస్తుల్ని వారి ప‌ర్యవేక్షణ‌లో ఉంచానని తెలిపారు. తీరా చూస్తే త‌న ఆస్తులు లేవ‌ని .. త‌న వాళ్లతో పాటే.. ఆస్తులు కూడ పోయాయ‌ని తెలిపారు. ఇండ‌స్ర్టీ త‌న‌కు పేరు, డ‌బ్బు, హోదా, గౌర‌వం ఇచ్చింద‌ని.. ఇండ‌స్ట్రీలో ఎవ‌రూ త‌న‌ని మోసం చేయ‌లేద‌ని చెప్పారు.
రాజేంద్ర ప్రసాద్​, సినిమా, హాస్యనటుడు

About Author