ఆదాయపు పన్ను మీకు వాపసు చేయబడిదంటూ మోసం ….
1 min read– మీ మొబైల్ లో ఉన్న డేటా మొత్తం సైబర్ నేరగాల చేతికి చేరుతాయి… ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
– నంద్యాల జిల్లా ఎస్పీరఘువీర్ రెడ్డి IPS.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రోజురోజుకీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో సైబర్ నేరగాళ్లు కొత్తరకం మోశాలకు తెరలేపడం జరుగుతుంది.ఈ సంధర్భంగా సైబర్ నేరగాళ్లు “ మీకు ఆదాయపు పన్ను వాపసు ఆమోదించబడింది. 15,490/-, మొత్తం త్వరలో మీ ఖాతాలో జమ చేయబడుతుంది. దయచేసి మీ ఖాతా నంబర్ 5XXXXX6755ని ధృవీకరించండి. ఇది సరైనది కాకపోతే, దయచేసి దిగువ లింక్ని సందర్శించడం ద్వారా మీ బ్యాంక్ ఖాతా సమాచారాన్ని నవీకరించండి. https://bit.ly/20wpYK6 అంటూ” సరికొత్త మోసానికి తెరలేపడం జరుగుతుంది.కావున మీరు పై లింకును నమ్మి క్లిక్ చేసి మోసపోవద్దు. ఒకవేల లింక్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ కోసం అంటూ వ్యక్తిగత వివరాలను సేకరించి మొబైల్ నెంబర్ కు ఓటిపి ని సైబర్ నేరగాళ్లు పంపుతారు. మెసేజ్ వచ్చిన ఓటీపీని మొబైల్ నందు ఎంటర్ చేయగానే మన మొబైల్ పూర్తిగా సైబర్ నేరగాళ్ల చేత రిమోట్ కంట్రోల్ యాక్సెస్ చేయబడుతుంది, అప్పుడు మీ యొక్క మొబైల్ లో ఉన్న ఫోటోలు, వీడియోలు, కాంటాక్ట్ నెంబర్లు, బ్యాంకు వివరాలు, ఇతరత్రా వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చేరుతాయి.మీ నియంత్రణ కోల్పోయి సైబర్ నేరగాళ్ల చేత నియంత్రించబడుతుందని,తర్వాత గంటల వ్యవధిలోనే బ్యాంకు అకౌంట్ లో ఉన్న నగదు మాయం అవుతూ వస్తుంది. కావున దయచేసి ప్రజలు గమనించవలసిన విషయం ఏమిటంటే.ఈ విధంగా లింకు పంపించడం వంటివి జరుగుతున్నాయని గ్రహించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీరు అప్రమత్తంగా ఉంటూ మీ కుటుంబ సభ్యులను మీ స్నేహితులను కూడా అప్రమత్తం చేస్తూ సైబర్ నేరగాళ్ల ఉచ్చులు పడకుండా జీవించాలని నంద్యాల జిల్లా ఎస్పీరఘువీర్ రెడ్డి IPS.,గారు ప్రజలకు సూచించారు.ప్రజలు ఎవరైనా ఈ తరహాలో మోసపోయి ఉంటే వెంటనే సైబర్ సెల్ కంప్లైంట్ నెంబర్ 1930 కు గాని www.cydercrime.gov.in లో ఫిర్యాదు చేయాలి లేదా నంద్యాల సైబర్ సెల్ నెంబర్ 9154987034 కు కాల్ చెయ్యండి.