NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉత్తరాంధ్ర నుంచి సీమకు వికేంద్రీకరణ ఉద్యమం

1 min read

పల్లెవెలుగువెబ్ : ఉత్తరాంధ్ర నుంచి సీమకు మారుతోంది వికేంద్రీకరణ ఉద్యమం.. విశాఖ గర్జన అనుభవాలతో.. సీమలోనూ మూడు రాజధానుల ఉద్యమాన్ని మరింత పటిష్టంగా నిర్వహించే ప్రయత్నాలు మొదలయ్యాయి. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం అంటున్న జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అదే విషయాన్ని సీమ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పనున్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా.. కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తున్నామని.. దీనికి సీమ ప్రజల మద్దతు కోరనున్నారు. మొన్నటి వరకు ఉత్తరాంధ్రలో పెద్దగా రాజధాని సెంటిమెంట్ లేదు. కానీ విశాఖ గర్జన ఏర్పాటు చేయడం.. అదే సమయంతో అమరావతి రైతులు పాదయాత్ర కొనసాగడంతో.. ఇప్పుడిప్పుడు ఉత్తరాంధ్రలోనూ కొంతమేర రాజధాని సెంటిమెంట్ కనిపిస్తోంది. ఇప్పుడు సీమలోనూ ఆ సెంటిమెంట్ తేగలగితే పొలిటికల్ గా వచ్చే ఎన్నికల్లో తమకు మైలేజ్ గా మారుతుందని వైసీపీ అంచనా వేస్తోంది. దీనిలో భగంగా ఈ నెల 29న తిరుపతిలో ఆత్మగౌరవ మహా ప్రదర్శనకు సిద్ధమైంది.. మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో ఆత్మ గౌరవ మహా ప్రదర్శన నిర్వహించనున్నట్టు ప్రకటించారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.

About Author