NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీ సంచ‌ల‌న నిర్ణయం..ఎన్నిక‌ల బ‌హిష్కర‌ణ‌

1 min read

అమ‌రావ‌తి: తెలుగు దేశం పార్టీ సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది. ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లు బ‌హిష్కరిస్తున్నట్టు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రక‌టించారు. ఎన్నిక‌లు స‌జావుగా జ‌రుగుతాయ‌న్న న‌మ్మకంలేద‌ని, బాధ‌తో ఆవేద‌న‌తో ఈ బ‌హిష్కరణ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఎన్నిక‌ల క‌మిష‌న్ కేవ‌లం ర‌బ్బర్ స్టాంప్ అని విమ‌ర్శించారు. ఇలాంటి ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ సార‌థ్యంలో ఎన్నిక‌లు ప్రజాస్వామ్యయుతంగా జ‌ర‌గ‌వ‌ని ఆయ‌న అన్నారు. నిన్న ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఆగ‌మేఘాల మీద తీసుకున్న నిర్ణయాల‌తో.. ఎస్ఈసీ మీద న‌మ్మకం పోయింద‌ని చంద్రబాబు తెలిపారు. దేశ చ‌రిత్రలో ఇదొక అరుదైన నిర్ణయ‌మ‌ని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ నాయ‌కులు, కార్యక‌ర్తల అభిప్రాయం తెలుసుకుని … ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయ‌న తెలిపారు. ప్రభుత్వ అవినీతి మీద రాజీలేని పోరాటం కొన‌సాగిస్తామ‌ని వెల్లడించారు.

About Author