కరువు మండలాలుగా ప్రకటించి.. రైతులను ఆదుకోవాలి : బీజేపీ
1 min readపల్లెవెలుగు వెబ్, పత్తికొండ : ప్రస్తుత ఖరీఫ్ లో సరైన సమయానికి వర్షాలు రాక పొలాల్లో వేసిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోయి అప్పులపాలయ్యారని, వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జ్ రంగాగౌడ్. నియోజకవర్గంలో కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరుతూ..సోమవారం పార్టీ మండల అధ్యక్షుడు కొత్తపల్లి శంకరయ్య ఆచారి అధ్యక్షతన బిజెపి నాయకులు, కార్యకర్తలు తాసిల్దార్ వెంకటేశ్వరకు వినతి పత్రాన్ని అందజేశారు. కొన్నేళ్లుగా అతివృష్టి… అనావృష్టి కారణంగా వేసిన పంటలు చేతికందలేదని, కొన్ని మండలాల్లో పంట చేతికొచ్చినా గిట్టుబాటు ధర లభించక లేదని, దీంతో ఆర్థికంగా చితికిపోయారని ఈ సందర్భంగా బీజేపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ఈడిగ రంగాగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఖరీఫ్ లో కూడా మొదట్లో వర్షాలు బాగా వచ్చినప్పటికీ పంట చేతికొచ్చే సమయంలో సరైన వర్షాలు రాకపోవడంతో పంటలు ఎండిపోయాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులు నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.50వేలు పరిహారంగా అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పూన మల్లికార్జున .రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండి మల్లికార్జున, పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం మాజీ కన్వీనర్ సిసి రంగన్న, బీజేపీ కిసాన్మోర్చా జిల్లా కార్యదర్శి బెస్త గోరంట్ల, లీగల్ సెల్ జిల్లా కో కన్వీనర్ అడ్వకేట్ నగేష్ , ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు కర్ణం చంద్రన్న, బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీధర్ గౌడ్ తదితరులు ఉన్నారు.