అనర్హుడిగా ప్రకటించండి
1 min readపల్లెవెలుగు వెబ్: నర్సాపురం వైసీపీ ఎంపీ రఘు రామకృష్ణ రాజుపై అనర్హత వేయాలని లోక్‌సభ స్పీకర్‌కు వైకాపా చీఫ్ విప్, ఎంపీ మార్గాని భరత్ ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. అనేక పర్యాయాలు డిస్క్వాలిఫికేషన్కు సంబంధించి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామను డిస్క్వాలిఫై చేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఎంపీ భరత్ విజ్ఞప్తి చేశారు.