NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆలూరు ను  కరువు మండలంగా ప్రకటించడం హర్షనీయం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఆలూరు నియోజకవర్గం కరువు మండలంగా ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ విజయం. అని ఆలూరు నియోజకవర్గం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ సహాయ కార్యదర్శి ఎం అమానుల్లా అన్నారు. అమానుల్లా మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన శ్రీ గిడుగు రుద్రరాజు ఆలూరు నియోజకవర్గంలో పర్యటనం చేసి ఆలూరు మండలం హత్తి బెళగల్ గ్రామంలో పర్యటించి రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారని మన అధ్యక్షులు మాట్లాడుతూ వెంటనే రైతులకు ఒక ఎకరానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. ఈ దశలో కరువు మండలాలుగా ప్రకటించడం రైతాంగానికి చాలా సంతోషకరమైన విషయమని ఇది కాంగ్రెస్ పార్టీ విజయమని కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీని రైతులు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే రైతులకు రుణమాఫీలు అవుతాయని ఆలూరు నియోజకవర్గం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ సహాయ కార్యదర్శి ఎం. అమానుల్లా చెప్పడం జరిగింది కావున రాబోయే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు వీరా సాబ్. చందు సాబ్. మల్లయ్య. హాసిం. ఖలీల్. జబ్బార్. వలి. అస్లాం. కాల్ అప్ప. రాందాసు మొదలగు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొడం జరిగింది.

About Author